Delhi: ఢిల్లీలో చుక్కలను అంటిన ఉల్లి ధరలు

  • భారీ వర్షాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో దెబ్బతిన్న ఉల్లి పంట
  • ఢిల్లీలోని రీటెయిల్ మార్కెట్ కు తగ్గిన ఉల్లి సరఫరా
  • కేజీ ఉల్లి ధర రూ. 60
దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. ఉల్లిని కోయకుండానే ఢిల్లీ జనాలకు కళ్ల వెంట నీరొస్తోంది. భారీ వర్షాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి పంట దెబ్బతింది. దీంతో, ఈ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోని రీటెయిల్ మార్కెట్ కు ఉల్లి సరఫరా తగ్గిపోయింది. 10 రోజుల క్రితం వరకు కిలో ఉల్లి ధర రూ. 25 నుంచి రూ. 30 వరకు ఉండగా... ఇప్పుడు కిలో ధర రూ. 60కి పెరిగింది. డిమాండ్ కంటే సరఫరా తక్కువగా ఉండటంతో... ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయని ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు.
Delhi
Onion Rate

More Telugu News