Nara Lokesh: ఐపీసీ 420 కేసులున్న ప్రబుద్ధులే అలాంటి పనులు చేస్తారని పెద్దలు చెబుతుంటారు, మీరు కూడా అదే చేశారు జగన్ గారూ!: నారా లోకేశ్

  • కోడెల మృతి నేపథ్యంలో లోకేశ్ స్పందన
  • కోడెలపై కుట్ర చేశారంటూ వ్యాఖ్యలు
  • మీరు దొంగలు అయితే అందరూ దొంగలవుతారా? అంటూ ట్వీట్
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అనుచితంగా వ్యవహరించారంటూ సీఎం జగన్ పై నారా లోకేశ్ మండిపడ్డారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్ విషయంలో నిబద్ధత కలిగిన వ్యక్తిగా కోడెల గారు ఎంతో హుందాగా స్పీకర్ కు లేఖ రాశారని, స్పీకర్ కూడా అందిందని సంతకం చేశారని, అలాంటప్పుడు కోడెల గారిపై కేసులు పెట్టాల్సిన అవసరం ఏంటని లోకేశ్ ప్రశ్నించారు.

ఐపీసీ 420 కేసులున్న ప్రబుద్ధులే అలాంటి పనులు చేస్తారని పెద్దలు చెబుతుంటారని, కోడెల గారి విషయంలో మీరు కూడా అదే చేశారని జగన్ పై ధ్వజమెత్తారు. ఇదంతా మీరు, మీ శకుని మామ విజయసాయిరెడ్డి కలిసి చేసిన కుట్ర, కోడెల గారిని మానసికంగా దెబ్బతీసేందుకు, వారి గౌరవ ప్రతిష్టలను చెడగొట్టేందుకు చేసిన పన్నాగం అని ఆరోపించారు. 'మీరు దొంగలు అయితే అందరూ దొంగలు అయిపోతారా? ఇంతకంటే నీచమైన ఆలోచన మరొకటి ఉండదు' అంటూ విమర్శించారు.
Nara Lokesh
Jagan
Vijay Sai Reddy

More Telugu News