Chandrababu: కోడెలను కడసారి చూసే వీల్లేకుండా చేయడానికే 144 సెక్షన్ పెట్టారు: చంద్రబాబు

  • నాటకాలు ఆడుతున్నారంటూ వైసీపీ నేతలపై ఫైర్
  • దుశ్చర్యలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యలు
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
ఓవైపు కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలపై ఆంక్షలు పెట్టి, మరోవైపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అంటూ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ నేతలపై మండిపడ్డారు. కోడెలను అభిమానులు కడసారి చూసే వీల్లేకుండా నరసరావుపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ విధించారని, 30 పోలీస్ యాక్ట్ తీసుకువచ్చారని ఆరోపించారు. తమ దుశ్చర్యలను దాచిపెట్టుకోవడానికే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, ఎంత అసత్య ప్రచారం చేసినా ప్రజలకు ఈ సర్కారు నిజస్వరూపం తెలిసిందని ట్వీట్ చేశారు.
Chandrababu
YSRCP
Kodela

More Telugu News