Congress: భయపడుతున్న కేసీఆర్: విజయశాంతి కీలక వ్యాఖ్యలు

  • పదేళ్లు తానే సీఎంనన్న కేసీఆర్
  • అసందర్భం, అయోమయ ప్రకటనే ఇది
  • హరీశ్ రావును తృప్తి పరచాలని భావిస్తున్న కేసీఆర్
  • కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి
వచ్చే పది సంవత్సరాలూ తానే తెలంగాణకు సీఎంగా ఉంటానని, తన ఆరోగ్యం భేషుగ్గా ఉందని నిన్న అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి స్పందించారు. కేసీఆర్ ప్రకటన అసందర్భంగా, అయోమయంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లో ఇప్పటికే అసమ్మతి పెరిగిపోయిందని, ఎంతోమంది కేసీఆర్ నిర్ణయాలను ఇప్పటికే బహిరంగంగా వ్యతిరేకించారని గుర్తు చేసిన ఆమె, అసమ్మతిని కట్టడి చేయడానికి, మేనల్లుడు హరీశ్‌ రావును సంతృప్తిపరచడానికే కేసీఆర్ మాట్లాడినట్టు అర్థం చేసుకోవచ్చని అన్నారు. టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తిని కేసీఆర్ కట్టడి చేసే పరిస్థితి లేదని విజయశాంతి అభిప్రాయపడ్డారు.
Congress
TRS
Vijayasanthi
KCR

More Telugu News