Krishna District: హనుమాన్ జంక్షన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

  • ఆటో-కారు ఢీ
  • మరో ఇద్దరి పరిస్థితి విషమం
  • మృతులంతా ఒకే కుటుంబం వారు
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొనడంతో అందులోని వారు ఎగిరి పడ్డారు. ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
Krishna District
Hanuman junction
Road Accident

More Telugu News