బిగ్‌బాస్ హౌస్ నుంచి శిల్పా చక్రవర్తి ఔట్
- నామినేట్ అయిన తొలివారంలోనే ఎలిమినేషన్
- ఆకట్టుకోలేకపోయిన శిల్ప
- అతి తక్కువ ఓట్లతో హౌస్ నుంచి అవుట్
ఈ వారం శిల్పతోపాటు శ్రీముఖి, హిమజ, పునర్నవి, మహేశ్ విట్టాలు నామినేట్ అయ్యారు. వీరిలో అతి తక్కువ ఓట్లు దక్కించుకున్న శిల్ప ఎలిమినేట్ కాక తప్పలేదు. కాగా, ఇప్పటి వరకు షో నుంచి ఎలిమినేట్ అయిన వారందరూ తొలిసారి నామినేట్ అయిన వారే కావడం గమనార్హం. గతంలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి కూడా హౌస్‌లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది.