Andhra Pradesh: ఇసుకను ‘ప్యాకేజీ’ల్లో అమ్మరని ఎవరైనా పవన్ కల్యాణ్ కు చెప్పండి!: విజయసాయిరెడ్డి వెటకారం

  • ఇటీవల గుంటూరులో జనసేనాని పర్యటన
  • ఇసుక స్టాక్ పాయింట్లను పరిశీలించిన పవన్
  • జనసేన అధినేత పర్యటనపై వైసీపీ నేత విసుర్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి నవులూరులో ఇసుక స్టాక్ పాయింట్ ను పవన్ సందర్శించడంపై వెటకారంగా స్పందించారు. ఇసుక విధానంపై ఏదైనా మాట్లాడాలంటే అలా కుప్పల దగ్గరకు వెళ్లి నాణ్యతను పరీక్షించాల్సిన అవసరం లేదని సాయిరెడ్డి తెలిపారు.

ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కు ఎవరైనా చెప్పాలని కోరారు. అలాగే ఇసుకను కేజీ, 10 కిలోల ‘ప్యాకేజీల్లో’ కూడా అమ్మబోరని చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ ఇళ్లు కట్టుకునేటప్పుడు ఇసుకను ఫ్రీగా అరేంజ్ చేసి ఉంటారనీ, కాబట్టి ఆయనకు ఇసుక రవాణా ఖర్చుల గురించి అవగాహన ఉండదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Pawan Kalyan
Twitter

More Telugu News