అమ్మాయిల దుస్తులపై ఆంక్షలు... హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో నిరసనలు!
- మోకాళ్ల కింద వరకూ దుస్తులుండాలి
- నిబంధన విధించిన ప్రిన్సిపాల్
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విద్యార్థినులు
ప్రిన్సిపాల్ పెట్టిన నిబంధనను తాము వ్యతిరేకిస్తున్నట్టు విద్యార్థినులు వెల్లడించారు. తక్షణమే తన నిర్ణయాన్ని ఆయన వెనక్కు తీసుకోవాలని, లేకుంటే సోమవారం నాడు తమ నిరసనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ ఉదయం కళాశాల వద్దకు చేరుకున్న పలువురు ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. దుస్తుల విషయంలో ఆంక్షలను తాము అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నారు.