బెంగళూరు పోలీసులకు శుభవార్త.. ఇకపై పుట్టిన రోజున సెలవు తీసుకునే వెసులుబాటు
- కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం
- ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్
- హర్షం వ్యక్తం చేస్తున్న పోలీసులు
నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఇందుకు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పుట్టిన రోజున కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. పుట్టిన రోజు సెలవు ఉత్తర్వులపై పోలీసులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.