రాయుడు ఈజ్ బ్యాక్.. హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపిక
- ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రాయుడు
- ఆపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని హెచ్‌సీఏకు లేఖ
- ఈ నెల 24 నుంచి బెంగళూరులో విజయ్ హజారే టోర్నీ
అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రకటించిన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలుపుతూ, ఇటీవల రాయుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు లేఖ రాశాడు. సెలక్షన్‌కు తాను అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అసోసియేషన్ రాయుడికి ఏకంగా జట్టు పగ్గాలు అప్పగించడం విశేషం.