కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణవాసుల దుర్మరణం!
- తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
- మద్యం మత్తులో బైక్ పై ప్రయాణం
- అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిన వాహనం
వీరిని గమనించిన స్థానికులు అంబులెన్సు ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించగా,అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. వీరిద్దరూ మద్యం మత్తులో బైక్ పై వెళుతున్నారని తెలిపారు.
మద్యం మత్తులో బైక్ నడపడం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. మృతులు తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందినవారని పేర్కొన్నారు. ఈ ప్రమాదం విషయమై వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశామని చెప్పారు.