కూతురి పెళ్లి కావడం లేదట... మళ్లీ పెరోల్ అడిగిన నళిని... ససేమిరా అంటూ తిరస్కరించిన కోర్టు!
- ఇప్పటికే రెండు సార్లు నళినికి పెరోల్
- పెళ్లి కుదరలేదని మరోసారి పెరోల్ కు పిటిషన్
- ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన ధర్మాసనం
ఆ పెరోల్ ఆగస్టు 24తో ముగిసే వేళ, వివాహం ఇంకా నిశ్చయం కానందున మరో నెల రోజులు పెరోల్ కావాలని ఆమె కోరింది. మానవతా దృక్పథంతో కేసును పరిశీలించి, మరో మూడు వారాలు పెరోల్ ఇస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. ఈ గడువు ఈ నెల 15తో ముగియనుంది. ఇంకా పెళ్లి ఏర్పాట్లు పూర్తి కాలేదని, మరో నెల రోజులు తాను బయట ఉండే అవకాశం కల్పించాలని ఆమె, ఇంకోసారి కోర్టు మెట్లెక్కగా, ఆ పిటిషన్ ను న్యాయమూర్తులు తోసిపుచ్చారు. 15వ తేదీ సాయంత్రం 6 గంటల కల్లా వేలూరు జైలుకు ఆమె వెళ్లాల్సిందేనని న్యాయమూర్తులు ఆదేశించడం గమనార్హం.