ఈ వంద రోజుల పాలన కేవలం ట్రైలరే..అసలు సినిమా ముందుంది: ప్రధాని మోదీ
- తీవ్రవాద నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేశాం
- జమ్మూకశ్మీర్, లడక్ లో అభివృద్ధికి చర్యలు చేపట్టాం
- జార్ఖండ్ వేదికగా కొత్త పథకాలను ప్రారంభించిన మోదీ
తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తాము సంకల్పించుకున్నామని, అందులో భాగంగా తీవ్రవాద నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేశామని చెప్పారు. జమ్మూకశ్మీర్, లడక్ లో అభివృద్ధిని నూతన శిఖరాలకు తీసుకెళ్లాలని సంకల్పించుకున్నామని, ఈ వంద రోజుల్లో ఆ దిశగా చర్యలు చేపట్టామని అన్నారు. ప్రజలను దోచుకున్న వారిని సరైన స్థానాలకు పంపిస్తామని, ఆ ప్రకియ కూడా మొదలైందని, ఇప్పటికే కొందరు జైలుకి కూడా వెళ్లారని అన్నారు. తమ ప్రభుత్వం దేశాన్ని తిరోగమనంలోకి తీసుకువెళ్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.