Tamilnadu: బామ్మ హోటల్ లో పెట్టుబడి పెడతా.. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రకటన!

  • రూపాయికే టిఫిన్ అందిస్తున్న కమలాథల్
  • పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమన్న మహీంద్రా
  • కోయంబత్తూరు బామ్మపై ప్రశంసల వర్షం
కోయంబత్తూరులో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న బామ్మ కమలాథల్ పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. 'ఇలాంటి కథనాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. మనం జీవితంలో చేసే అన్నిపనులు కమలాథల్ చేస్తున్న సేవలో కొంత భాగానికి అయినా సరితూగుతాయా? అని అనిపిస్తోంది.

కమలాథల్ ఇంకా కట్టెల పొయ్యినే వాడుతున్నట్లు నేను వీడియోలో గమనించా. ప్రజలెవరైనా ఆమె వివరాలు కనుక్కొని నాకు చెబితే కమలాథల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు, ఓ ఎల్పీజీ స్టవ్ ను కొనిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని ప్రకటించారు. దీంతో పలువురు నెటిజన్లు ఆమె వివరాలను ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్ లో పంపారు.
Tamilnadu
Bamma hotel
Koyambatturu
aanand mahendra
Anand mahindra
Twitter
Investment

More Telugu News