తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో... ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఒప్పందం!
- 30 నుంచి బ్రహ్మోత్సవాలు
- భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు
- తమిళనాడుకు మరిన్ని బస్సులు
కాగా, బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 8 వరకూ జరగనున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య 150 ప్రత్యేక బస్సులు నడపాలని అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక ఈ బస్సులను ఏఏ రూట్లలో నడపాలన్న విషయాలపైనా అధికారులు చర్చించారు. ఇక, 18 నుంచి వచ్చే నెల 17వ వరకు పెరటాశి మాసం కావడంతో, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు అదనపు ట్రిప్పులు నడపాలని కూడా అధికారులు నిర్ణయించారు.