పాకిస్థాన్ వెళ్లేందుకు వెనుకంజ వేసిన శ్రీలంక క్రికెటర్లు... భారతే కారణమంటున్న పాక్ మంత్రి
- పాక్ టూర్ కు వెళ్లబోమని ప్రకటించిన 10 మంది లంక క్రికెటర్లు
- వింత వాదన చేస్తున్న పాక్ మంత్రి
- లంక క్రికెటర్లను భారత్ బెదిరిస్తోందంటూ ఆరోపణలు
పాక్ పర్యటనకు వెళ్లొద్దంటూ శ్రీలంక క్రికెటర్లను భారత్ బెదిరిస్తోందని ఆరోపించారు. పాక్ టూర్ కు వెళితే ఐపీఎల్ కాంట్రాక్టులు రద్దు చేస్తామని హెచ్చరించినట్టు కొందరు క్రీడా వ్యాఖ్యాతల నుంచి సమాచారం అందిందని చెప్పారు. ఇది నిజంగా చవకబారు చర్య అని, క్రీడలు మొదలుకుని అంతరిక్షం వరకు భారతదేశానిది యుద్ధోన్మాదం అని, దాన్ని తప్పకుండా ఖండించాల్సిందేనని వ్యాఖ్యానించారు.