కేంద్రమంత్రి గడ్కరీ కారుకూ తప్పని జరిమానా!
- కారు వేగంగా నడిపినందుకు జరిమానా
- చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న మంత్రి
- తమ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం ఈ చట్టాన్ని తీసుకురావడమేనన్న గడ్కరీ
ప్రమాదాల నివారణ కోసమే మోటారు వాహనాల సవరణల చట్టం తీసుకొచ్చామని, ఇది తమ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. భారీ జరిమానాల వల్ల పారదర్శకత పెరుగుతుందని, అవినీతికి తావుండదని అన్నారు. కారు వేగంగా నడిపినందుకు తాను కూడా జరిమానా కట్టాల్సి వచ్చిందని గడ్కరీ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే వారికి ఎటువంటి భయం అవసరం లేదన్నారు.