Nagineedu: సెట్లో నన్ను ఎవరు పలకరించకపోయినా నేను పెద్దగా ఫీలవను: నటుడు నాగినీడు

  • 'మర్యాద రామన్న'తో మంచి పేరు 
  • ఎవరినీ తక్కువగా చూసే అలవాటు లేదు
  • ఎదుటివారిని అభినందించడానికి ఆలోచించను
నాగినీడు పేరు వినగానే 'మర్యాద రామన్న'లో విలన్ పాత్రలో ఆయన జీవించిన తీరు గుర్తొస్తుంది. ఒక వైపున ప్రతినాయక పాత్రలతోను .. మరో వైపున ఇతర ముఖ్యమైన పాత్రల్లోను ఆయన మెప్పించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన ధోరణి ఎలా ఉంటుందనేది ప్రస్తావించారు.

"నేను ఒక సినిమా చేయడం కోసం సెట్లోకి అడుగుపెట్టిన తరువాత, అక్కడ ఏ భాష నటులు వున్నారు .. నా కంటే పెద్ద పాత్రలు చేస్తున్నారా .. చిన్న పాత్రలను చేస్తున్నారా? అనేది ఆలోచించను. నా దగ్గరికొచ్చి ఎవరూ పలకరించకపోయినా నేను పెద్దగా ఫీల్ అవను .. నేనే వెళ్లి పలకరిస్తాను. నిర్మాత ఇచ్చే డబ్బులు తీసుకుని నటించడానికి నేను వెళ్లాను. ఎవరో పలకరించలేదనీ .. స్నేహంగా ఉండటం లేదని నేను అక్కడ ఆలోచించకూడదు. నా డ్యూటీ నేను చేసి వెళ్లిపోవాలి అనుకుంటాను అంతే. నా తోటి ఆర్టిస్ట్ బాగా చేస్తే అభినందించడానికి నేను ఎంత మాత్రం వెనుకాడను" అని చెప్పుకొచ్చారు.
Nagineedu

More Telugu News