Nara Lokesh: లేని అవినీతిని చంద్రబాబుగారికి అంటగట్టాలని చూస్తే మీ నీచత్వం ఇలాగే బయటపడుతుంది: నారా లోకేశ్

  • పీపీఏల రద్దు అంశంపై లోకేశ్ స్పందన
  • జగన్ చేస్తున్నది అసత్యప్రచారం అంటూ వ్యాఖ్యలు
  • జగన్ గురించి కేంద్ర మంత్రే స్వయంగా ఈ మాట చెప్పాడని వెల్లడి
ఏపీ సర్కారుపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పీపీఏల విషయంలో అవినీతి జరిగిందని జగన్ చేస్తున్నదంతా అసత్యప్రచారమేనని కేంద్ర మంత్రి స్వయంగా చెప్పాడని లోకేశ్ ట్వీట్ చేశారు. లేని అవినీతిని చంద్రబాబుగారికి అంటగట్టాలని చూస్తే మీ నీచత్వం ఇలాగే బయటపడుతుందంటూ హెచ్చరించారు. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలంటూ హితవు పలికారు.

"పీపీఏలను రద్దు చేయాలంటూ వైసీపీ నేతలు తరచుగా కేంద్రానికి లేఖలు సమర్పిస్తూ ఒత్తిడి చేస్తున్నారట. ఇంత ఆరాటం ఎందుకు జగన్ గారూ. పాత పీపీఏలు రద్దయితే మీ సొంత పవర్ ప్రాజెక్టులకు లాభం వచ్చేలా కొత్త ఒప్పందాలు చేసుకోవాలనే కదా" అంటూ నిలదీశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యల మీడియా క్లిప్ ను కూడా లోకేశ్ ట్వీట్ చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జగన్ చేస్తున్నది అసత్య ప్రచారం అంటూ ఆర్కే సింగ్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
Nara Lokesh
Jagan
Chandrababu

More Telugu News