పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇరాన్!
- ఇరాన్ లోని రాయబార కార్యాలయంలో భారత వ్యతిరేక బ్యానర్లను ఏర్పాటు చేసిన పాక్
- బలవంతంగా బ్యానర్లను తొలగించిన ఇరాన్ అధికారులు
- ఇవి దౌత్య సిద్ధాంతాలకు వ్యతిరేకమన్న ఇరాన్
అనంతరం, పాకిస్థాన్ చర్యలను ఇరాన్ ఎండగట్టింది. ఇలాంటి పనులు దౌత్యనీతిని దెబ్బతీస్తాయని చెప్పింది. ఓ దేశం గురించి ఇలాంటి బ్యానర్లను ఏర్పాటు చేయడం దౌత్య సిద్ధాంతాలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ లోని తమ రాయబార కార్యాలయం వద్ద సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా తాము బ్యానర్లు ఏర్పాట్లు చేస్తే... మీ విదేశాంగశాఖ ఎలా స్పందిస్తుందని పాక్ రాయబారిని ఇరాన్ ప్రశ్నించింది. ఇరాన్ చర్యలతో పాకిస్థాన్ కంగుతుంది. అయినా తన తీరును సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఏదైనా ఒక సమాచారాన్ని ప్రదర్శించే హక్కు తమకు ఉందని ఓ లేఖ ద్వారా వెల్లడించింది.