ఈ ఏడాది 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం!: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- మోదీ 100 రోజుల పాలనలో కీలక నిర్ణయాలు
- దేశాన్ని వేధిస్తున్న సమస్యలను మోదీ పరిష్కరించారు
- గుంటూరులో మీడియాతో కేంద్ర మంత్రి
అలాగే సంస్కరణల్లో వేగం పెరిగిందనీ, ప్రతీఒక్కరి సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. మోదీ సారథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ అదనంగా లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాదిలో 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పడనుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం వచ్చాక 3 నెలల్లోనే 30 బిల్లులను ఆమోదించామనీ, ఇది ఓ చరిత్రని వ్యాఖ్యానించారు. ఒకే దేశం-ఒకే పవర్ గ్రిడ్ విధానంతో ముందుకెళుతున్నామని చెప్పారు.