Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రూటు మారుస్తున్న రకుల్ 
  • తమిళ సినిమాలో జగపతి 
  • 'జాన్'కు రెడీ అవుతున్న ప్రభాస్
 *  ఇన్నాళ్లూ కమర్షియల్ చిత్రాలు మాత్రమే చేస్తూ వచ్చిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్  చిత్రాలపై దృష్టి పెడుతోంది. కథానాయిక ప్రధానంగా సాగే చిత్రాలలో నటించాలని ఉందని చెబుతూ, అలాంటి చిత్రాలలో తన సత్తా చూపిస్తానని అంటోంది. మరి ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి!
*  ఆమధ్య 'లింగా', 'భైరవ' వంటి తమిళ చిత్రాలలో నటించిన ప్రముఖ నటుడు జగపతిబాబు తాజాగా మరో తమిళ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పాడు. విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా నటించే 'లాభం' చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం.
*  'సాహో' తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ప్రభాస్ తన తదుపరి చిత్రం 'జాన్' షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. కె.కె.రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే కొంత జరిగింది. తాజా షెడ్యూలును వచ్చే నెలలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.  
Rakul
Jagapathi Babu
Vijay Sethupati
Shruti Hassan

More Telugu News