భారత రాష్ట్రపతి కావాలనుకుంటున్నానన్న బాలుడి ప్రశ్నకు అబ్బురపడిన మోదీ
- మోదీతో కలసి చంద్రయాన్-2 ల్యాండింగ్ ను వీక్షించిన 70 మంది విద్యార్థులు
- విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన ప్రధాని
- అవాంతరాలను ఎదుర్కొని విజయాలను సొంతం చేసుకోవాలని చెప్పిన మోదీ
ఈ సందర్భంగా తాను భారత్ రాష్ట్రపతి కావాలనుకుంటున్నానని... ఈ దిశగా తనకు కొన్ని సలహాలు ఇవ్వాలని ఓ విద్యార్థి మోదీని కోరాడు. విద్యార్థి ప్రశ్నకు అబ్బురపడిపోయిన మోదీ... ప్రధాని కావాలని నీవెందుకు కోరుకోవడం లేదని సరదాగా ప్రశ్నించారు. రాష్ట్రపతే కావాలని ఎందుకు అనుకుంటున్నావు? అని అడిగారు. ఈ సందర్భంగా చంద్రుడిపై ప్రయోగాలకు సంబంధించి మోదీతో తమ ఆలోచనలను విద్యార్థులు పంచుకున్నారు.