USA: అమెరికాలో ఘోరం... పడవ ప్రమాదంలో భారత దంపతుల మృతి

  • స్కూబా డైవింగ్ కోసం శాంటాక్రజ్ ద్వీపానికి వెళ్లిన భారత దంపతులు
  • పడవలో అగ్నిప్రమాదం
  • కాలిఫోర్నియా తీరంలో అగ్నికి ఆహుతైన పడవ
అమెరికాలో భారత దంపతులు మృతి చెందిన విషయం వెల్లడైంది. కాలిఫోర్నియాలోని శాంటా క్రజ్ ద్వీపంలో ఓ పడవ ప్రమాదంలో మరణించారు. నాగ్ పూర్ కు చెందిన ప్రముఖ వైద్యుడు సతీశ్ దియో పూజారి కుమార్తె, అల్లుడు అమెరికాలో నివసిస్తున్నారు. దియో పూజారి కుమార్తె ఓ డెంటిస్ట్ కాగా, అల్లుడు ఓ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగి. స్కూబా డైవింగ్ కోసం ఇద్దరూ శాంటా క్రజ్ ద్వీపానికి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బోటులో 33 మంది పర్యాటకులు, ఆరుగురు డైవింగ్ ఇన్ స్ట్రక్టర్లు ఉన్నారు. అయితే, బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కొద్దిసేపట్లోనే జరగరాని నష్టం జరిగిపోయింది. ఐదుగురు డైవింగ్ ఇన్ స్ట్రక్టర్లు ప్రాణాలు దక్కించుకోగా, 34 మంది మరణించారు.
USA
India
Boat
Fire Accident
Santacruz

More Telugu News