Chandrababu: చంద్రబాబు మంచి ఆర్గనైజరే కానీ ప్రజలు ఆయన్ని నమ్మట్లేదు: బీజేపీ నేత మురళీధర్ రావు

  • ఏపీలో టీడీపీ పని అయిపోయింది
  • లోకేశ్ పై ఆ పార్టీ కార్యకర్తలకే నమ్మకం లేదు
  • వైసీపీపై మా పోరాటం కొనసాగుతుంది
ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలపైనా, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా బీజేపీ నేత మురళీధర్ రావు విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వానికి భవిష్యత్ లో సమస్యలు తప్పవని అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి తమ పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైసీపీపై తమ పోరాటం కొనసాగుతుందని, తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ పని అయిపోయిందని విమర్శించిన మురళీధర్ రావు, చంద్రబాబుపై మాత్రం ప్రశంసలు కురిపించారు. ఇప్పటికీ చంద్రబాబు మంచి ఆర్గనైజరే కానీ, ప్రజలు మాత్రం ఆయన్ని నమ్మడం లేదని అభిప్రాయపడ్డారు. నారా లోకేశ్ పై ఆ పార్టీ కార్యకర్తలకే నమ్మకం లేదని అన్నారు.
Chandrababu
Telugudesam
bjp
Muralidhar
Rao

More Telugu News