Saaho: సాహో ఈ స్థాయిలో ఉందంటే అందుకు కారణం అభిమానులే: కృతజ్ఞతలు తెలిపిన ప్రభాస్

  • ఆగస్టు 30న రిలీజైన సాహో
  • ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైగా వసూలు చేసిందంటూ పోస్టర్ 
  • ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన ప్రభాస్
ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన సాహో మూవీ ఆగస్టు 30న రిలీజై బాక్సాఫీసు వద్ద గణనీయమైన స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైగా గ్రాస్  వసూలు చేసిందంటూ పేర్కొంటున్న ఓ పోస్టర్ ను హీరో ప్రభాస్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. నా ప్రియమైన ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు... సాహో పట్ల మీరు చూపుతున్న ఎల్లలు లేని అభిమానానికి ధన్యవాదాలు అంటూ పోస్టు చేశాడు. సాహో చిత్రం ఈ స్థాయిలో ఉండడానికి, ఇంతటి ఘనవిజయం సాధించడానికి అభిమానులే కారణమని తెలిపాడు. మొదటి నుంచి వారి ప్రోత్సాహం, వారి స్పందన అద్భుతమని, అందుకే అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు తన పోస్టులో పేర్కొన్నాడు.

Saaho
Prabhas
Andhra Pradesh
Telangana
Tollywood

More Telugu News