ఆస్ట్రేలియాలో భారత హై కమిషనర్ తో రోజా భేటీ

  • ఆస్ట్రేలియా పర్యటనలో ఏపీఐఐసీ చైర్మన్ రోజా
  • హై కమిషనర్ డాక్టర్ ఏఎం గొండనేతో సమావేశం
  • ఏపీలో అభివృద్ధి పథకాల గురించి వివరించిన రోజా
ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రోజా తన పర్యటనలో భాగంగా బిజీగా ఉన్నారు. ఆస్ట్రేలియాలో భారత హై కమిషనర్ డాక్టర్ ఏఎం గొండనేతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పథకాల గురించి వివరించిన రోజా, ఏపీలో పెట్టుబడుల అవకాశాల గురించీ తెలియజేశారు. అభివృద్ధి పథకాల గురించి తెలుసుకున్న హై కమిషనర్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించినట్టు రోజా తన పోస్ట్ లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Australia
India
High commissioner
Roja

More Telugu News