తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ పూర్తిగా నిలిపివేత!
- ఇక తిరుపతిలో మాత్రమే టోకెన్ల జారీ
- రద్దీని తగ్గించేందుకేనన్న అధికారులు
- తిరుమలలో రద్దీ సాధారణం
ఈ నేపథ్యంలో ఇకపై తిరుపతిలోని కేంద్రాల్లో మాత్రమే టైమ్ స్లాట్ టోకెన్లు లభ్యమవుతాయని, తిరుమలలోని అన్ని కేంద్రాలనూ మూసివేశామని టీటీడీ ప్రకటించింది. కాగా, తిరుమలలో ఈ ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి కేవలం 4 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి. సాధారణ సర్వదర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. నిన్న మంగళవారం నాడు స్వామివారిని 63,580 మంది దర్శించుకున్నారని, హుండీ ఆదాయం రూ. 2.98 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.