జమ్మూ కశ్మీర్ పంచాయతీ సంఘ సభ్యులతో అమిత్ షా కీలక సమావేశం
- హోం శాఖ కార్యాలయంలో కొనసాగుతున్న సమావేశం
- సమావేశానికి హాజరైన మంత్రులు, అధికారులు
- ఆర్టికల్ 370 రద్దు, పంచాయతీల అభివృద్ధిపై చర్చ
అసోసియేషన్ కు చెందిన మరో సభ్యుడు మాట్లాడుతూ, ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు ధన్యవాదాలు చెప్పబోతున్నామని తెలిపారు. ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నందుకు జమ్మూకశ్మీర్ కు ఇది సంతోషకర సమయమని చెప్పారు. ఈ ఆర్టికల్ ను రద్దు చేయాలని జమ్ము ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని అన్నారు. తమ రాష్ట్రంలోని పంచాయతీలకు ఉన్న సమస్యలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లబోతున్నామని చెప్పారు.
ఈ భేటీలో అమిత్ షాతో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, హోం సెక్రటరీ ఏకే భల్లా, అడిషనల్ సెక్రటరీ జ్ఞానేశ్ కుమార్ లు కూడా పాల్గొన్నారు. హోం శాఖ కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది.