Puri Jagannadh: పూరి 'ఫైటర్' టైటిల్ దాదాపు ఖరారైనట్టే

  • పూరి తదుపరి సినిమాగా 'ఫైటర్'
  • దసరాకి లాంచ్ చేసే ఆలోచన 
  • నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్   
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో తన తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి పూరి సిద్ధమవుతున్నాడు. విజయ్ దేవరకొండతో తన తదుపరి సినిమాను ఆయన రూపొందించనున్నాడు. చార్మీతో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి.

ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. అదే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. దసరాకి ఈ సినిమాను లాంచ్ చేసి, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగు జరపాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. కథానాయికలు .. ప్రతినాయకుడుతో పాటు మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Puri Jagannadh
Vijay Devarakonda

More Telugu News