Krishna District: ప్రియుడితో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని!

  • కలకలం రేపిన విద్యార్థిని ఆత్మహత్య
  • కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
  • ప్రేమ వ్యవహారమే కారణమంటున్న కాలేజీ సిబ్బంది
ఓ విద్యార్థిని, మరో యువకుడితో వీడియో కాలింగ్ లో మాట్లాడుతూ, ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి, ట్రిపుల్‌ ఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ 3వ సంవత్సరం చదువుతోంది.

తన బాయ్‌ ఫ్రెండ్‌ కు వీడియో కాల్ చేసిన ఆమె, హాస్టల్‌ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని కాలేజీ సిబ్బంది అంటున్నట్టు తెలుస్తోంది. భాగ్యలక్ష్మి మృతికి అసలు కారణాలను తెలుసుకుంటామని, ఆమె చివరిగా వీడియో కాల్ మాట్లాడిన యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Krishna District
Nuziveedu
IIIT
Sucide

More Telugu News