అసోంలో ఎన్నార్సీ ప్రకటనపై.. కేంద్రంపై మండిపడ్డ జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్!
- అసమంజసంగా ఈ నిర్ణయం తీసుకున్నారు
- భారతీయులు స్వదేశంలోనే విదేశీయులయ్యారు
- కేంద్రం జాతీయ భద్రత అంశాలను దృష్టిలో పెట్టుకోలేదు
ఈ వ్యవహారంలో కేంద్రం జాతీయ భద్రత విషయంలో తలెత్తే వ్యూహాత్మక సమస్యలను దృష్టిలో పెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను రాజకీయంగా పరిష్కరించాలన్న తప్పుడు ధోరణి కారణంగా ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని విమర్శించారు. కాగా, ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇంతవరకూ స్పందించలేదు. కాగా, ఎన్నార్సీ నిర్ణయాన్ని ప్రజలు విదేశీయుల ట్రైబ్యునల్స్ తో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా సవాలు చేయవచ్చు.