Sikh Girl: సిక్కు బాలికను బలవంతంగా మతం మార్పించి, పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ వ్యక్తి ఎవరో తెలుసా?
పాకిస్థాన్‌లోని గురుద్వారా ప్రాంతంలో నివసించే సిక్కు బాలిక జగ్జీత్ కౌర్‌ను కిడ్నాప్ చేసి, అనంతరం బలవంతంగా మతం మార్చి, ఓ ముస్లిం వ్యక్తి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. 2008 ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ కు చెందిన ఉగ్రసంస్థ జమాత్ ఉద్దవాతో సంబంధం ఉన్న వ్యక్తిగా అతడిని గుర్తించారు. ఇంకా అతడిని అరెస్ట్ చేయాల్సి ఉంది.
ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ స్పందించలేదు. అయితే, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... జరిగిన దారుణం ప్రపంచానికంతా తెలిసిపోయింది.