Botsa Satyanarayana: ఇసుకపై సంపాదన పోతుందనే టీడీపీ బాధ: బొత్స

  • విజయనగరం జిల్లా ప్రగతిపై బొత్స సమీక్ష
  • ఐదేళ్లుగా ఇసుక టీడీపీ నేతల ప్రధాన ఆదాయ వనరుగా ఉందన్న మంత్రి
  • కొత్త విధానంతో తమ సంపాదన పోతుందనే నిరసనలు  
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము తీసుకువస్తున్న నూతన ఇసుక విధానం అమలుకు కొంత సమయం పడుతుందని అన్నారు. ఈ విషయం పట్ల ప్రజల్లో అవగాహన కలిగినా, టీడీపీ నేతలకు మాత్రం అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా ఇసుకపై టీడీపీ నాయకులు బాగా సంపాదించుకున్నారని, ఇప్పుడు ప్రభుత్వం కొత్త విధానం తీసుకువస్తుండడంతో వారికి బాధ కలుగుతోందని అన్నారు. సంపాదన పోతుందన్న ఆందోళనతోనే నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారని బొత్స మండిపడ్డారు. ఇసుకపై తమ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనే టీడీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Botsa Satyanarayana
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News