cm: జగన్ మళ్లీ మంత్రి బొత్సతోనే మాట్లాడించారు!: టీడీపీ నేత సోమిరెడ్డి

  • రాజధానిపై స్పష్టత లేకుండా బొత్స మళ్లీ మాట్లాడారు!
  • బొత్స మాటలు అనువాదం చేయించుకున్నా అర్థంకావు
  • బాలకృష్ణ అల్లుడిపై ఏదో ఒక నింద మోపాలని చూడొద్దు
సీఎం జగన్ నిన్న నిర్వహించిన సీఆర్డీఏ సమీక్షపై అంతా ఆసక్తిగా ఎదురు చూశారని, సమీక్ష అనంతరం, జగన్ మళ్లీ మంత్రి బొత్సతోనే మాట్లాడించారని టీడీపీ నేత సోమిరెడ్డి విమర్శించారు. బొత్స మాటలు అనువాదం చేయించుకున్నా అర్థంకాని పరిస్థితి అని, రాజధానిపై స్పష్టత లేకుండా బొత్స మళ్లీ ఏదేదో మాట్లాడారని విమర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ కు చెందిన కంపెనీ భూముల గురించి ఆయన ప్రస్తావించారు. భరత్ కు చెందిన భూములు ఇప్పుడు ఎవరి పరిధిలో ఉన్నాయి? ఆ భూమి ప్రభుత్వం దగ్గర ఉందా? లేక భరత్ చేతుల్లో ఉందా? అని ప్రశ్నించారు. బొత్స మంత్రిగా ఉన్నప్పుడే ఆ భూముల ఎంవోయూ జరిగిందని, బాలకృష్ణ అల్లుడని చెప్పి ఆయనపై ఏదో ఒక నింద మోపాలని చూడటం తగదని అన్నారు.
cm
jagan
minister
botsa
somireddy

More Telugu News