దూసుకొస్తున్న డోరియన్ హరికేన్.. ఎమర్జెన్సీ ప్రకటించిన ఫ్లోరిడా
- బుధవారం వర్జిన్ దీవులను తాకిన ‘డోరియన్’
- అప్రమత్తమైన ఫ్లోరిడా
- వారానికి సరిపడా అన్నీ సిద్ధం చేసుకోవాలని పౌరులకు సూచన
డోరియన్ హరికేన్ బుధవారం అమెరికాలోని వర్జిన్ దీవులను తాకింది. దీనిని ఒకటో కేటగిరీగా పరిగణిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూడా హరికేన్ డోరియన్పై స్పందించారు. తుపానును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.