ఏపీలో టీడీపీ నేతల పక్క చూపులు...ఇద్దరు వైసీపీ వైపు, ఒకరు బీజేపీలోకి!
- ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి వరుపుల గుడ్ బై
- అదే మార్గంలో విశాఖ నేత ఆడారి ఆనంద్‌కుమార్
- కమలదళంలో కలిసేందుకు సిద్ధమవుతున్న పంచకర్ల
ప్రస్తుతం ఈ ఇద్దరు నాయకులు చెరో పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లా రైతుల్లో ఆడారి తులసీరావుకు మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో డెయిరీ పాలకవర్గంపై అధికార పార్టీ దృష్టిసారించడంతో ఆనంద్ పార్టీ మారే యోచన చేస్తున్నారని తెలుస్తోంది. సోదరుడి బాటలోనే తులసీరావు కుమార్తె, ఎలమంచిలి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పిళ్లా రమాకుమారి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 1న విజయవాడలో జగన్ సమక్షంలో వీరు వైసీపీలో చేరుతారని భోగట్టా. ఇక, పంచకర్ల రమేష్‌బాబు బీజేపీలోకి వెళ్లిపోతే భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో ఉన్న నేతలతో తనకు పరిచయం ఉన్న వారి ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
మరోవైపు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, గత ఎన్నికల్లో పత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిన వరుపుల రాజా ఇప్పటికే టీడీపీకి గుడ్‌బై చెప్పారు. అదే సమయంలో ఆయన వైసీపీ అధినేత జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించడంతో ఆయన వైసీపీలో చేరుతారన్న విషయం స్పష్టమైపోయింది.