పాక్‌లో దారుణం.. సిక్కు యువతిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చి వివాహం!

  • ఈ నెల 27న యువతికి తుపాకి గురిపెట్టి అపహరణ
  • అనంతరం మతం మార్చి, పేరు మార్చి వివాహం
  • నిందితులను శిక్షించాలంటూ ఇమ్రాన్‌కు బాధిత కుటుంబం మొర
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఓ సిక్కు యువతిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చి ముస్లిం యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. లాహార్‌లోని నంకన సాహిబ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. తమ కుమార్తెను మతం మార్పించి వివాహం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులు ఓ వీడియోలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అభ్యర్థించారు.

బాలికను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి ఆమె పేరును ఆయేషాగా మార్చిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మతం మార్చి పేరు పెట్టిన అనంతరం ‘మౌల్వి’ ఆమెకు దగ్గరుండి ముస్లిం యువకుడితో వివాహం జరిపించాడు. హిందూ, సిక్కు, క్రిస్టియన్ యువతులను బలవంతంగా మతం మార్చి ముస్లిం యువకులకు ఇచ్చి వివాహాలు జరిపించే ఘటనలు పాకిస్థాన్‌లో ఇటీవల బాగా పెరిగిపోయాయి.

తాజా ఘటనలో గురుద్వారా తంబు సాహిబ్‌లో ‘గ్రంథి’(పూజారి)గా పనిచేస్తున్న వ్యక్తి కుమార్తె అయిన 19 ఏళ్ల యువతిని ఈ నెల 27న తుపాకి గురిపెట్టి బలవంతంగా అపహరించారు. అనంతరం మతం మార్చి ముస్లిం యువకుడితో పెళ్లి జరిపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్, చీఫ్ జస్టిస్ అసిఫ్ సయీద్ ఖోసాలను వేడుకుంది.
Go Back to Shorts
Sikh girl
Pakistan
converted
married
muslim
imran khan

More Telugu News