Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

17 ఏళ్ల అమ్మాయిపై లైంగిక వేధింపులు.. మరాఠీ నటుడి అరెస్ట్

  • ఈ నెల 23నే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • బాలికతో బలవంతంగా బికినీ తొడిగించి ఫొటోలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి
17 ఏళ్ల అమ్మాయిపై లైంగిక వేధింపుల కేసులో 24 ఏళ్ల మరాఠీ నటుడు, దర్శకుడు మందర్ కుల్‌కర్ణిని పూణె పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ఈ నెల 23నే అరెస్ట్ చేసినట్టు పోలీసులు తాజాగా వెల్లడించారు. థియేటర్ వర్క్‌షాప్స్ నిర్వహించే కులకర్ణి ఓ వర్క్‌షాప్‌లో బాధిత బాలికను కలిశాడు. ఈ నెల 16న ఆమెను తన అపార్ట్‌మెంట్‌‌కు పిలిచాడు.

ఆమెకు నటించే అవకాశం కల్పిస్తానని చెప్పి ఓ డ్రెస్ ఇచ్చి ధరించమని చెప్పాడు. అనంతరం ఆ డ్రెస్‌లో ఆమె ఫొటోలు తీసుకున్నాడు. ఆ తర్వాత బికినీ ఇచ్చి దానిని వేసుకోవాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో గతంలో తాను తీసిన ఇతర అమ్మాయిల ఫొటోలు చూపించాడు. దీంతో ఆమె ఆ డ్రెస్ ధరించి ఫొటోలకు పోజిచ్చింది. అనంతరం ఇంటికెళ్లిన బాలిక విషయాన్ని తన తల్లితో చెప్పగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.
Marathi actor
photo shoot
girl

More Telugu News