ప్రపంచ విజేత పీవీ సింధుకు హైదరాబాద్ లో ఘనస్వాగతం

  • ప్రపంచ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించిన పీవీ సింధు
  • ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్న తెలుగుతేజం
  • స్వాగతం పలికిన తెలంగాణ క్రీడల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్ గా చరిత్ర సృష్టించిన తెలుగుతేజం పీవీ సింధుకు ఎక్కడికెళ్లినా నీరాజనాలు పడుతున్నారు. ఈ ఉదయం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సింధు కొద్దిసేపటి క్రితమే సొంతగడ్డపై అడుగుపెట్టింది. కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట చేరుకుంది. హైదరాబాద్ చేరుకున్న సింధుకు ఘనస్వాగతం లభించింది. తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సింధుకు సాదర స్వాగతం పలికారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్ బాబు కూడా ఎయిర్ పోర్టు వద్దకు వచ్చారు. 
Go Back to Shorts
PV Sindhu
Hyderabad
Telangana

More Telugu News