ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు!
- డీడీసీఏ నిర్ణయం!
- గతంలో ఢిల్లీ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన జైట్లీ
- ఇకపై అరుణ్ జైట్లీ స్టేడియంగా మారనున్న ఫిరోజ్ షా కోట్లా
ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో జైట్లీ చేసిన కృషి అసామాన్యమని, విరాట్ కోహ్లీ, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, రిషబ్ పంత్ వంటి అనేకమంది క్రికెటర్లు జైట్లీ సపోర్ట్ తో భారతదేశం గర్వించేలా ప్రదర్శన చేశారని, చేస్తున్నారని శర్మ పేర్కొన్నారు. అంతటి గొప్పవ్యక్తికి ఇది తగిన గౌరవంగా భావిస్తున్నామని అన్నారు.