భారత వ్యతిరేక వీడియో పోస్టు చేసిన పాక్ దేశాధ్యక్షుడికి ట్విట్టర్ నోటీసులు
- కశ్మీర్ నిరసనల ర్యాలీ వీడియో పోస్టు చేసిన పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ
- ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపిన ట్విట్టర్
- ట్విట్టర్ కార్యాలయాల్లో పనిచేస్తున్న భారతీయుల చలవే అని పాక్ ఆరోపణ
దీనిపై పాక్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కశ్మీర్ కు అనుకూలంగా పోస్టులు పెడుతున్న వారి ఖాతాలను ట్విట్టర్ తొలగిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ప్రధాన కార్యాలయాల్లో ఎక్కువగా భారతీయులే పనిచేస్తున్నారని, వారే తమ ఖాతాలు తొలగిస్తున్నారంటూ పాక్ ప్రముఖులు ఆరోపిస్తున్నారు.