Afghanisthan: జలాలాబాద్ లోని పాక్ ఎంబసీపై ఉగ్రదాడి!

  • గత రాత్రి భారీ పేలుడు
  • ముగ్గురికి గాయాలు
  • భద్రతను పటిష్ఠం చేయాలని కోరిన పాక్
ఆఫ్ఘనిస్థాన్ లోని జలాలాబాద్ నగరంలో ఉన్న పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట గత రాత్రి ఉగ్రవాదులు భారీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీసు సహా, ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, వారిని వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

అయితే, తమ దేశ రాయబార కార్యాలయ అధికారులంతా క్షేమమేనని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ముహమ్మద్ ఫైజల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే సమయంలో వీసాల నిమిత్తం దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన ఇద్దరు పాక్ పౌరులకు గాయాలు అయ్యాయని తెలిపారు. రాయబార కార్యాలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని తాము ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని కోరామని ఫైజల్ తెలిపారు.
Afghanisthan
Jalalabad
Pakistan
Blast

More Telugu News