ఇద్దరం ఒకే సంవత్సరంలో పుట్టాం... ముందే వెళ్లిపోయారు: జైట్లీ మృతిపై సీతారాం ఏచూరి ఆవేదన
- జైట్లీ మృతిపై సీపీఎం ప్రధాన కార్యదర్శి స్పందన
- నిర్వేదం వెలిబుచ్చిన ఏచూరి
- బీజేపీలో అంతటి సమర్థుడు మరొకరు లేరంటూ కితాబు
సిద్ధాంతాల పరంగా ఇద్దరి మధ్య భావ వైరుధ్యం ఉన్నా, తమ మధ్య చర్చ ఎప్పుడూ పక్కదారి పట్టలేదని వివరించారు. ఓ రకంగా ఇద్దరమూ కలిసే పెరిగాం అని చెప్పుకోవాలని, నేను రాజ్యసభ నుంచి రిటైరైనప్పుడు కూడా జైట్లీ ఇదే మాట చెప్పారని జ్ఞాపకం చేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేరంటూ ఎంతో బాధ కలుగుతోందని వ్యాఖ్యానించారు.