రేపు మధ్యాహ్నం అరుణ్ జైట్లీ అంత్యక్రియలు
- కాసేపట్లో జైట్లీ నివాసానికి పార్థివదేహం
- రేపు ఉదయం బీజేపీ ప్రధాన కార్యాలయానికి భౌతికకాయం
- రేపు మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు
రేపు ఉదయం బీజేపీ ప్రధాన కార్యాలయానికి పార్థివదేహాన్ని తీసుకెళ్తారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళి అర్పించనున్నాయి. అనంతరం అక్కడి నుంచి నిగమ్ బోధ్ ఘాట్ కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
మరోవైపు, జైట్లీ మరణం నేపథ్యంలో బీహార్ లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.