కొందరు ప్రజాప్రతినిధులు దర్శనం టికెట్లను రూ.15,000కు అమ్ముకుంటున్నారు!: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
- కొందరు తిరుమలలో దళారి వ్యవస్థను నడుపుతున్నారు
- వీరంతా ప్రజాప్రతినిధుల పీఆర్వోలమని చెప్పుకుంటున్నారు
- తిరుమలలో మీడియాతో టీటీడీ చైర్మన్
తిరుమలలో ఈరోజు వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. కొందరు ప్రజాప్రతినిధులు తమ లేఖలను దుర్వినియోగం చేస్తున్నారని సుబ్బారెడ్డి విమర్శించారు. ఒక్కో టికెట్ ను రూ.14,000-రూ.15,000లకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను అరికడతామని పునరుద్ఘాటించారు.