తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జైట్లీ విలువలకు కట్టుబడ్డారు!: ఏపీ సీఎం జగన్
- ఈరోజు మధ్యాహ్నం కన్నుమూసిన జైట్లీ
- నివాళులు అర్పించిన ఏపీ ముఖ్యమంత్రి
- ఆయన కుటుంబానికి ధైర్యాన్నివ్వాలని ప్రార్థన
‘అరుణ్ జైట్లీ గారు ఇక లేరని వినాల్సి రావడం నిజంగా బాధాకరం. ఆయన తెలివైనవారు, స్నేహపూర్వకమైన వ్యక్తి. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో దేశానికి గుర్తించదగ్గ సేవలను జైట్లీ అందించారు. ప్రతీసారి విలువలకు కట్టుబడ్డారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని జగన్ ట్వీట్ చేశారు.