Raj Tharun: హీరో రాజ్ తరుణ్ అరెస్ట్... బెయిల్

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదులోని నార్సింగిలో కారు యాక్సిడెంట్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రాజ్ తరుణ్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్ పై రాజ్ తరుణ్ విడుదలయ్యాడు. కారు యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ పై 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, యాక్సిడెంట్ తర్వాత పారిపోతున్న రాజ్ తరుణ్ ను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న కార్తీక్ పై కూడా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కార్తీక్ ను కూడా అదుపులోకి తీసుకుని స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తామని వెల్లడించారు.
Go Back to Shorts
Raj Tharun
Tollywood
Arrest
Bail

More Telugu News