చిదంబరంను విచారించేందుకు 100 ప్రశ్నలను సిద్ధం చేసిన సీబీఐ
- చిదంబరంను నిన్న అరెస్ట్ చేసిన సీబీఐ
- ఈరోజు సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు
- తమ కస్టడీకి అప్పగించాలని కోరనున్న సీబీఐ
చిదంబరం అరెస్ట్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని కాంగ్రెస్ మండిపడింది. సీబీఐ, ఈడీలను స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిదంబరంకు అండగా ఉంటామని... చివరి వరకు పోరాడుతామని తెలిపింది.