Guntur District: జగన్ కి జై కొట్టుకోండి..నాకేమీ ఇబ్బంది లేదు: చంద్రబాబు

  • గుంటూరు జిల్లాలో వరద బాధితులకు బాబు పరామర్శ
  • పోతాలంకలో పర్యటించిన చంద్రబాబు
  • ‘జై జగన్’ అంటూ కొందరు గ్రామస్తుల నినాదాలు
గుంటూరు జిల్లాలో వరద బాధితులను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా కొల్లూరు మండలంలోని పోతాలంకను ఆయన సందర్శించారు. వరద బాధితులను ఆయన పరామర్శిస్తున్న సమయంలో గ్రామస్తులు కొందరు ‘జై జగన్’ అని నినాదాలు చేశారు. ఇందుకు స్పందించిన చంద్రబాబు.. ‘జగన్ కి జై కొట్టుకోండి..నాకేమీ ఇబ్బంది లేదు. వెళ్లి జగన్ ని, మంత్రులను వరద ప్రాంతాలకు తీసుకురండి’ అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. కాగా, గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో, కొల్లూరు మండలంలోని వరద బాధితులను చంద్రబాబు ఈరోజు పరామర్శించారు.
Guntur District
Kollu
potalanka
Chandrababu

More Telugu News